జైరాం రమేశ్ పై చర్యలు తీసుకోవాలి: వీహెచ్
ఆదిలాబాద్: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ మోసం చేశారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు విమర్శించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ను వదిలివెళ్లినవారు పార్టీలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై జైరాం రమేశ్ ను ఎవరు పుస్తకం రాయమన్నారని ఆయన ప్రశ్నించారు. జైరాం రమేశ్ పై హైకమాండ్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డీకే అరుణ మాట్లాడుతూ.. ఒకేసారి రైతు రుణాలు మాఫీ చేయకుండా విడతలవారీగా చేస్తూ అన్నదాతలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పుడు హామీలవల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చివుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని పేర్కొన్నారు.