
సాక్షి, హైదరాబాద్ : మైనర్ బాలిక మధులికపై జరిగిన దాడి ఘటన దుర్మార్గమైందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. విద్యార్థినిపై అతికిరాతకంగా దాడి జరుగుతుంటే ఎవ్వరూ అపకపోవడం దారుణమన్నారు. అమ్మాయి నుంచి నేలమీద పడ్డ రక్తపు బొట్లను కడిగెయ్యడం అమానుషమని తెలిపారు.
అబ్బాయిపై ఫిర్యాదు చేస్తే షీటీమ్స్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చారు తప్ప పోలీసులు ఎందుకు సీరియస్ వార్నింగ్ ఇవ్వలేదని వీహెచ్ మండిపడ్డారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు భరత్, ఆయనకు సహకరిస్తున్న బంధువులపై చర్యలు తీసుకోవాలన్నారు. షీ టీమ్ ఎందుకు కేసు బుక్ చెయ్యలేదని ప్రశ్నించారు. కేవలం కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో క్రైమ్ ఎక్కువ అవుతోందని ధ్వజమెత్తారు.
చదవండి : హైదరాబాద్ బర్కత్‌పురాలో ఘోరం