తాగుబోతు, మాఫియా తెలంగాణగా మారింది
Published Fri, Aug 11 2017 2:21 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అహంకార మాటలు మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేక దొరల రాజ్యమా అని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను మంత్రి కేటీఆర్ దొంగచాటుగా పరమర్శించాల్సిన అవసరమేంటని నిలదీశారు. పెద్దపులి వంటి ఎస్పీని వదిలి జింకపిల్ల లాంటి ఎస్సైపై వేటువేయడం సిగ్గుచేటన్నారు. బాధితుల పక్షాన ప్రతిపక్షాలు పోరాడుతుంటే రాజకీయమంటూ నిందలు వేయడం తగదన్నారు.
దళితుల మరణానికి కారణమైన లారీ డ్రైవర్, యజమానిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దళితులను చిత్రహింసలు పెట్టిన ఎస్పీని తప్పించినపుడే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. లారీ ప్రమాదం కారణంగా చనిపోయిన కుటుంబాలకు రూ. 20 లక్షలు, పోలీసుల చేతిలో థర్డ్ డిగ్రీకి గురైన వారికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. తాగుబోతు, ఇసుక మాఫియా తెలంగాణగా రాష్ట్రం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement