భాగ్యనగరంలో గతంలో గుంత చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పారని మాజీ ఎంపీ వీహెచ్ ఆరోపించారు.
హైదరాబాద్ : భాగ్యనగరంలో గతంలో గుంత చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ఇప్పుడు నగరమంతా గుంతలే దర్శనమిస్తున్నాయని ఆయన విమర్శించారు.
నగరంలోని రహదారుల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు బుధవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు. నగర జీవి ఇంటి నుంచి బయటకొస్తే మళ్లీ ఇల్లు చేరే వరకు భరోసా లేదని వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు.