
నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం
వేములవాడ: నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడలోని మనోహర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల ఘటన బాధితులను గురువారం ఆయన పరామర్శించారు.
వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులను పోలీసులు ఇష్టారీతిన చిత్రహింసలు పెట్టారని తెలిపారు. సిరిసిల్లా జిల్లాలో ఇసుక మాఫియా కొనసాగుతోందని వీహెచ్ ఆరోపించారు.