రైతులకు న్యాయం చేయాలి: వీహెచ్‌ | vh on farmers problems | Sakshi

రైతులకు న్యాయం చేయాలి: వీహెచ్‌

Jan 11 2018 2:47 AM | Updated on Sep 19 2019 8:28 PM

vh on farmers problems - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రైతుల భూముల్లో విద్యుత్‌ సరఫరా టవర్లు నిర్మించిన తెలంగాణ సర్కార్‌.. ఆయా స్థలాలకు నష్టపరిహా రం చెల్లించేందుకు నిరాకరిస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్కే సింగ్‌కు బుధవారం లేఖ రాశారు.

కేంద్ర మార్గదర్శకాల మేరకు రహదారుల సమీపంలోని భూముల్లో టవర్లు నిర్మిస్తే టవర్‌కు రూ.4.5 లక్షలు, దూరంగా ఉన్న భూముల్లో టవర్లు నిర్మిస్తే టవర్‌కు రూ.3.15 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపారు. విద్యుత్‌ టవర్ల మధ్య స్థలానికి, పంట నష్టానికి 35 ఏళ్ల పాటు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement