
రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రచార రథం చక్రాలు ఊడిపోయాయి. నేరెల్ల మూలమలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రచార రథంలో ఉన్న హనుమంతరావుకు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.