
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శించి నోరు పాడు చేసుకున్న బండి సంజయ్ కాళ్లు పాడుచేసుకునేందుకు ప్రజా సంగ్రామయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం సంజయ్ ఢిల్లీవైపు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ సతీశ్‌కుమార్‌తో కలిసి శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోసమే సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని, ఉన్నత పదవుల కోసం ప్రతిపక్ష పార్టీల నేతలు పోటీపడి యాత్రలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గిరిజనులపై ప్రేమ ఉంటే సంజయ్ పార్లమెంటులో మాట్లాడాలని, కేసీఆర్‌ను గిరిజన గాంధీగా రవీంద్రకుమార్ అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment