
నటి తాప్సీ
సాక్షి, చెన్నై: నువ్వు కూడా హీరోయిన్ అయిపోదామనే.. ఏముందీ నీలో? ఒక అందం ఉందా? ఆకర్షించే అవయవ సంపద ఉందా? నీది చాలా సీరియస్ ముఖం. నీకు హీరోయిన్ అయ్యే లక్షణాలే లేవు. నీ పేరుతో వ్యాపారం అవ్వదు అని ఒక దర్శకుడు స్టుపిట్ కారణాలతో తూలనాడాడని నటి తాప్సీ చెప్పింది. అయితే ఇది ఇప్పటి సంగతీ కాదట. కొత్తగా అవకాశాల వేటలో ఉన్న సమయంలోనని తాప్సీ పేర్కొంది.
ఆ దర్శకుడు ఎవరన్నది మాత్రం ఈ అమ్మడు బయటపెట్టలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అందుకున్న తాప్సీ ప్రస్తుతం హిందీలో వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటిస్తోంది. అయితే ఎప్పుడూ, ఏదోఒక అంశంతో వార్తల్లో ఉంటుంది తాప్సీ. ప్రస్తుతం హీరోయిన్‌గా తన తొలి రోజుల అనుభవాలను ఇటీవల ట్విటర్‌లో పేర్కొని మరోసారి సోషల్ మీడియాలకు పని చెప్పింది. దక్షిణాదిలో నటిగా గుర్తింపు తెచ్చుకుని, ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌కు వెళ్లి ఆ తరువాత దక్షిణాదికి చెందిన వారిని విమర్శించడం హీరోయిన్‌లకు ఫ్యాషన్ అయ్యింది.
తాప్సీ కూడా అంతే. బాలీవుడ్‌లో రెండు మూడు సక్సెస్‌లు రాగానే దక్షిణాది చిత్రపరిశ్రమతో పని లేదనుకుంటారో, ఏమోగానీ.. ఇలియానా, తాప్సీ లాంటి వాళ్లు నోరు జారడం చూస్తున్నాం. అసలు తనేమందో చూద్దాం. నటిగా ఆరంబంలో చాలా అవమానాలను ఎదుర్కొన్నాను.
‘నా మాదిరిగా చెల్లెల్ని కష్టపడనీయను. కారణం ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ఇష్టపడేది నా చెల్లెలినే. తనంటే నాకు చాలా ప్రేమ. సినిమా రంగంలోకి రావద్దని తన చెల్లెలికి చెప్పలేదు. అయితే నా మనసులో ఉంది మాత్రం అదే. ఇక నాకు నటన అంటే ఇష్టం. కానీ ఈ రంగంలో ఎలా రాణించడానికి ఎలా ప్రవర్తించాలో అప్పట్లో నాకు తెలియదు. వివిధ రకాల పాత్రల్లో నటించాలి. సినిమాలో ఎలా ఎదగాలి అన్న విషయాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాను. ఏమీ తెలియని నేను ఇంతగా నేర్చుకోవడం ఈ స్థాయికి చేరుకోవడం పెద్ద విషయమే’ అని నటి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment