
ఇటీవల మృతి చెందిన దర్శకుడు ఎస్.పి.జననాథన్ చిత్రపటానికి నటుడు విజయ్ సేతుపతి నివాళులర్పించారు. ఇయర్కై, ఈ, పేరాన్మై, పురంబోకు వంటి వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు ఎస్.పి.జననాథన్. పురంబోకు చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం లాభం. ఈ చిత్రంలొనూ విజయ్ సేతుపతినే కథానాయకుడిగా నటిస్తున్నారు.
నటి శృతి హాసన్ నాయకిగా నటించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో జననాథన్ ఏప్రిల్ 14న మెదడు సంబంధించిన వ్యాధితో కన్నుమూశారు. ఈయన ఆస్పత్రి ఖర్చులను విజయ్ సేతుపతే భరించారు. అదే విధంగా జననాథన్ అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. కాగా కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయ్ సేతుపతి లాభం చిత్ర యూనిట్‌తో కలిసి జననాథన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment