
చెన్నై: నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న మామనిదన్ చిత్ర అప్‌డేట్స్‌ను నిర్మాత వెల్లడించారు. ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా చిత్రాలు నటుడిగా రాణిస్తున్న నటుడు విజయ్ సేతుపతి. ఈయన గత రెండేళ్ల క్రితం కథానాయకుడిగా నటించిన చిత్రం మామనిదన్. నటి గాయత్రి నాయికగా నటించిన ఈ చిత్రానికి శీను రామస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా తన తండ్రి, సంగీత జ్ఞాని ఇళయరాజాతో కలిసి సంగీత బాణీలు అందించడంతో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలను చేపట్టారు.
రెండేళ్ల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొన్ని సమస్యల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అలాంటిది తాజాగా మామనిదన్ చిత్రానికి విముక్తి లభించనుంది. సమ్మర్ స్పెషల్‌గా మే నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇటీవల ప్రకటించారు. కాగా చిత్రంలోని తొలి పాటను బుధవారం విడుదల చేయనున్నట్లు చిత్ర సంగీత దర్శకుడు, నిర్మాత యువన్ శంకర్ రాజా తాజాగా ప్రకటించారు. తాను, తన తండ్రి ఇళయరాజా కలిసి బాణీలు సమకూర్చిన ఈ పాట తమ అభిమానులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చదవండి: ‘అసలు జాకీకి ఒంట్లో భయమే లేదా’
Comments
Please login to add a commentAdd a comment