
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి ప్రచారంలో ఉన్న 'మెర్రీ క్రిస్మస్' అనే టైటిల్‌నే ఖరారు చేసినట్లు నిర్మాత రమేష్ తౌరుని వెల్లడించారు. ఇక ఈ మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి- కత్రినా మొదటిసారి నటిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఈ సినిమా షూటింగ్ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే జూన్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే అతి కొద్ది తారాగణంతో షూటింగ్ చేయాలని భావిస్తున్నారట. దీంట్లో విజయ్ సేతుపతి, కత్రినా సహా మరికొద్ది మంది పాల్గొనున్నట్లు సమాచారం.
చదవండి : విజయ్‌ను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్..రీజన్ అదే!
ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్
Comments
Please login to add a commentAdd a comment