తనకు బలం లేదని పవన్‌ కల్యాణే ఒప్పుకున్నారు:మిథున్‌రెడ్డి | YSRCP Midhun Reddy Criticize Jana Sena Pawan Kalyan | Sakshi
Sakshi News home page

తనకు బలం లేదని పవన్‌ కల్యాణే ఒప్పుకున్నారు:మిథున్‌రెడ్డి

Published Sun, Jul 9 2023 12:39 PM | Last Updated on Sun, Jul 9 2023 1:12 PM

YSRCP Midhun Reddy Criticize Jana Sena Pawan Kalyan  - Sakshi

కాకినాడ: టీడీపీతో పొత్తు ఆశయంలో భాగంగానే జనసేన నేత పవన్ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ మిథున్‌రెడ్డిఅన్నారు. ముఖ్యమంత్రిని కానని గతంలో పవన్‌ చెప్పారని, అంత బలం తనకు లేదని స్వయంగా పవన్ చెప్పిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు.  

ప్రజలతో నేరుగా ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలనేదే తమ పార్టీ స్ట్రాటజీ అని మిధున్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే తమవల్ల ఉపయోగం ఉంటేనే ఓటు వెయ్యమని సీఎం జగన్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముద్రగడ వైఎస్సార్‌సీపీలోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వనిస్తామన్నారు.

ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌తోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గడప గడపకు ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్లే వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని, వారే తమ పార్టీ అభ్యర్ధులని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టాప్ ప్రయారిటీ ఉంటుందని మిథున్‌రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement