సాక్షి, న్యూఢిల్లీ : ఎమర్జెన్సీ విధించి 43 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ సూత్రాలపై కాంగ్రెస్ నేరుగా జరిపిన దాడిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీని అభివర్ణించారు. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, సుప్రీం కోర్టును మౌన ప్రేక్షకుడిలా చేసిందని, పార్లమెంట్‌ను నిర్వీర్యం చేసి, మీడియా గొంతు నులిమిందని బీజేపీ చీఫ్ అమిత్ షా విరుచుకుపడ్డారు.
భారత ప్రజాస్వామ్యంలో అది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన వేధింపుల గురించి నేటి తరానికి తెలిసే విధంగా పాఠ్యపుస్తకాల్లో వీటిని పొందుపరచాలని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. మరోవైపు ఎమర్జెన్సీ చీకటి రోజులను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గుర్తుచేశారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీని హిట్లర్‌తో పోల్చారు.
Comments
Please login to add a commentAdd a comment