లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ అద్భత పాలన అందిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. లక్నోలోని ఓ వేడుకకు సీఎం యోగితో కలిసి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో గోరఖ్‌పూర్ పీఠాదిపథిగా యోగి.. అందరి మన్ననలు పొందాడని అమిత్ షా గుర్తుచేశారు. రాజకీయంగా, సామాజికంగా ఉత్తరప్రదేశ్ భారతదేశానికి చాలా కీలక రాష్ట్రమని అభిప్రాయపడ్డారు. యోగి పాలన వల్ల యూపీకి రికార్డు స్థాయిలో రూ. 65,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు.
యోగి రాజకీయాల్లో ఉంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. కనీసం మున్సిపాలిటీని కూడా పాలించిన అనుభవం లేని వ్యక్తి.. యూపీ వంటి పెద్ద రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడనే సందేహం చాలామందికి ఉండేదన్నారు. కానీ వాటన్నింటికీ తన అద్భుతమైన పనితనంతో యోగి సమాధానం చెప్పాడని పేర్కొన్నారు. యోగికి అనుభవం లేకున్నా క్రమశిక్షణ, నిబద్దత, కష్టపడేతత్వం ఉన్నాయని.. అందుకే ఆయన ఆ పదవికి సమర్ధుడని బీజేపీ అధిష్టానంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ భావించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment