సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాకు ఆమోద ముద్ర పడింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూ రాష్ట్ర నాయకత్వం సిద్ధంచేసిన ఈ జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) పరిశీలించి, చర్చించిన అనంతరం గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ.. మొత్తంగా 55 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ విడివిడిగా సమావేశాలు నిర్వహించింది.
సీఈసీ సభ్యులు.. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, భూపేంద్రయాదవ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తోపాటు.. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్ఢి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించి పార్టీ రాష్ట్ర నాయకత్వం సమరి్పంచిన జాబితాను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పరిశీలించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గెలిచే స్థానాలు.. గెలవగలిగే నేతలతో..
ఇంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితా ప్రకటన కోసం అనుసరించిన వి«ధానాన్నే తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటనలోనూ అనుసరించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులను బరిలో దింపాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనికితోడు పార్టీ బలంగా ఉండి ఒకరే ఆశావహులున్న చోట్ల అభ్యర్థుల ప్రకటనకు సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 60–70 మందితో తొలి జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే స్థానం సాధించగా.. ఈసారి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకునే దిశగా వ్యూహాలను సిద్ధం చేస్తోందని అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment