TS BJP
-
గెలుపు గుర్రాలకు బీజేపీ గ్రీన్ సిగ్నల్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాకు ఆమోద ముద్ర పడింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూ రాష్ట్ర నాయకత్వం సిద్ధంచేసిన ఈ జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) పరిశీలించి, చర్చించిన అనంతరం గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ.. మొత్తంగా 55 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. సీఈసీ సభ్యులు.. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, భూపేంద్రయాదవ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తోపాటు.. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్ఢి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించి పార్టీ రాష్ట్ర నాయకత్వం సమరి్పంచిన జాబితాను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పరిశీలించారని పార్టీ వర్గాలు తెలిపాయి. గెలిచే స్థానాలు.. గెలవగలిగే నేతలతో.. ఇంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితా ప్రకటన కోసం అనుసరించిన వి«ధానాన్నే తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటనలోనూ అనుసరించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులను బరిలో దింపాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనికితోడు పార్టీ బలంగా ఉండి ఒకరే ఆశావహులున్న చోట్ల అభ్యర్థుల ప్రకటనకు సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 60–70 మందితో తొలి జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే స్థానం సాధించగా.. ఈసారి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకునే దిశగా వ్యూహాలను సిద్ధం చేస్తోందని అంటున్నాయి. -
బండి సంజయ్‌కు ప్రమోషన్.. కీలక బాధ్యతలు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జాతీయ కమిటీలో చోటు కల్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ను ఏదైనా ఒక రాష్ట్రానికి పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకురాలు డీకే అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వై.సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ కమిటీలో కీలక మార్పులు చేశారు. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఒక జాతీయ సంస్థాగత వ్యవహారాల సహ ప్రధాన కార్యదర్శి, 13 మంది జాతీయ కార్యదర్శులు, ఒక కోశాధికారి, ఒక సహ కోశాధికారితో కూడిన జాతీయ కమిటీని జేపీ నడ్డా నియమించగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జిగా ఉన్న సునీల్ దేవ్‌ధర్‌ను పార్టీ జాతీయ కార్యదర్శిగా తప్పించారు. కర్ణాటకకు చెందిన సీటీ రవి, అస్సాంకు చెందిన ఎంపీ దిలీప్ సైకియాలను ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పక్కనబెట్టారు. అదేవిధంగా, కార్యదర్శులుగా ఉన్న యూపీ ఎంపీలు వినోద్ సోంకార్, హరీశ్ ద్వివేదిలు కూడా పార్టీ పదవులను పోగొట్టుకున్నారు. ఇంకా, పార్టీ ఉపాధ్యక్షులుగా మైనారిటీ వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. వీరిలో ఒకరు కేరళకు చెందిన అబ్దుల్లా కుట్టీ, మరొకరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్, యూపీ బీజేపీ ఎమ్మెల్సీ మన్సూర్. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలు, ఎజెండాకు కీలకంగా ఉన్న సీటీ రవికి ఉద్వాసన పలకడం వెనుక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయమే కారణమన్న అభిప్రాయం ఉంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీటీ రవి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిరిజన నేత లతా ఉసెండీకి పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. జాతీయ కార్యదర్శులుగా నియమితులైన 9 మందిలో ఏడుగురు పాతవారు కాగా, రాధా మోహన్ అగర్వాల్‌ను కొత్తగా తీసుకున్నారు. ►బీజేపీ జాతీయ నూతన పదాధికారుల జాబితా: జాతీయ ఉపాధ్యక్షులు: రమణ్‌సింగ్, వసుంధరా రాజే సింధియా, రఘుబర్ దాస్, సౌదాన్ సింగ్, బైజయంత్ పాండా, సరోజ్ పాండే, రేఖా వర్మ, డీకే అరుణ, ఎం.చుబా ఎఓ, అబ్దుల్లా కుట్టీ, లక్ష్మీకాంత్ బాజ్‌పేయ్, లతా ఉసెండీ, తారిక్ మన్సూర్. ►జాతీయ ప్రధాన కార్యదర్శులు: అరుణ్ సింగ్, కైలాశ్ విజయవర్గీయ, దుష్యంత్ కుమార్ గౌతమ్, తరుణ్ ఛుగ్, వినోద్ తావడే, సునీల్ బన్సల్, బండి సంజయ్ కుమార్, రాధా మోహన్ అగర్వాల్. ►జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు): బీఎల్ సంతోష్ ►జాతీయ సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు): శివప్రకాశ్ ►జాతీయ కార్యదర్శులు: విజయా రాహట్కర్, సత్య కుమార్, అరవింద్ మీనన్, పంకజా ముండే, నరేంద్ర సింగ్ రైనా, అల్కా గుర్జర్, అనుపమ్ హాజ్రా, ఓం ప్రకాశ్ ధువ్రే, రుతురాజ్ సిన్హా, ఆశా లాకడా, కామాఖ్యా ప్రసాద్ తాసా, సురేంద్ర సింగ్ నాగర్, అనిల్ ఆంటోని. ►కోశాధికారి: రాజేశ్ అగర్వాల్ ►సహ కోశాధికారి: నరేశ్ బన్సల్ -
చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
-
ఎస్సీ,ఎస్టీ నియోజక వర్గాలపై టీ-బీజేపీ ఫోకస్
-
కరీంనగర్ కాషాయ దళంలో కలవరం..
-
2023 టార్గెట్ గా పావులు కదుపుతున్న బీజేపీ
-
తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం
-
హాట్‌హాట్‌గా ఓటు వేట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. ఓవైపు మండుటెండలు అదరగొడుతున్నా రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా తెల్లారిన దగ్గరి నుంచి చీకటి పడేంతవరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారపర్వంలో అధికార టీఆర్ఎస్ ఒకింత ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు కూడా శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నాయి. సాగర్‌లో పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తన టీంతో కలిసి విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, ఆయన తనయులకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా జట్టుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా చూసుకుంటుండగా, బీజేపీ అభ్యర్థి రవినాయక్ స్థానిక నేతలతో కలిసి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ రెండ్రోజుల రోడ్‌షోకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, సీఎం కేసీఆర్‌తో మరోమారు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా జనగర్జన తరహాలోనే మరోమారు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈనెల 10 తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సాగర్‌కు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. దీంతో మరో పది రోజులు గడువు ఉన్నా... ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కనుంది. 14న నిడమనూరులో సీఎం సభ! నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి.. భగత్ గెలుపు బాధ్యతలను తీసుకొని గ్రామాలను కలియ తిరుగుతున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రతి రోజు గ్రామాలకు వెళ్లి కేసీఆర్ పాలనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఇన్ఛార్జిలుగా నియమితులైన బయటి జిల్లాల ఎమ్మెల్యేలు తమకు అప్పగించిన టీంలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఐటీ మంత్రి కేటీఆర్ కూడా నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారనే ప్రచారం సాగర్ గులాబీ దండును ఉరకలు పెట్టిస్తోంది. దీంతోపాటు ముఖ్యమంతి కేసీఆర్ మరోమారు నియోజకవర్గంలో బహిరంగసభకు హాజరవుతారని, ఈ నెల 14న ఆయన నిడమనూరులో జరిగే సభలో పాల్గొంటారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఎండలను సైతం ఖాతరు చేయని, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భగత్ విజయం కోసం పట్టు వదలకుండా పని చేస్తున్నారు. టార్గెట్ జానా జానారెడ్డినే టార్గెట్ చేసి టీఆర్ఎస్ తమ ప్రచారం నిర్వహిస్తోంది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, తెలంగాణ వచ్చాకే సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు ఇవ్వగలిగామని చెబుతోంది. జానారెడ్డి అనేక శాఖలకు మంత్రిగా పని చేసినా నియోజకవవర్గ ప్రజలను ఉద్దరించిందేమీ లేదని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు గులాబీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్కు దీటుగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడి ఉప ఎన్నికను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో టీఆర్ఎస్కు తీసిపోకుండా దూసుకెళ్తోంది. జానారెడ్డితో పాటు ఆయన తనయులు రఘువీర్, జయవీర్‌లు విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ తదితరులు నియోజకవర్గంలోనే ఉండి ఓటర్లను కలుస్తున్నారు. జానారెడ్డి అభివృద్ధి చేయలేదన్న టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నపుడే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఒరిగిందేమీలేదని ఓటర్లకు చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉంది. అయితే సీఎం కేసీఆర్ సభ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిని బట్టి కాంగ్రెస్ సభ నిర్వహించాలా? వద్దా..? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీలు కోమటిరెడి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలు కూడా జానా ప్రచారానికి తోడు కానున్నారు. పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు సాగర్‌లోనే ఉండి జానా గెలుపు బాధ్యతలను భుజానవేసుకున్నారు. సర్దిచెప్పుకొని సమన్వయంతో ముందుకెళ్తున్న బీజేపీ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన అభ్యర్థిని కాదని కొత్త వ్యక్తి డాక్టర్ రవి నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైనా క్షేత్ర స్థాయి నాయకత్వానికి సర్ది చెప్పుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. ప్రస్తుతానికి స్థానిక నేతలలో కలిసి రవికుమార్ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పార్టీలకు పోటీ ఇచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, టికెట్ ఆశించిన నివేదితా రెడ్డి కూడా తాజాగా ప్రచారంలో కలిసి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన స్వగ్రామం పలుగుతండాకు వెళ్లిన సందర్భంగా విలపించి వార్తల్లోకెక్కిన రవికుమార్ ఆ తరువాతి రోజున రూటు మార్చి డాన్స్‌లు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పార్టీలోని రాష్ట్ర స్థాయి, ద్వితీయ శ్రేణి నేతలను సాగర్‌లో ప్రచారానికి పంపించిన బీజేపీ ముఖ్యనేతలను రంగంలోకి దింపేందుకు చర్యలు చేపట్టింది. రవికుమార్ ఎన్నికల ప్రచారానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు తరలిరానున్నారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం ప్రచార షెడ్యూలు ఖరారు చేస్తోంది. ఈనెల 10వ తేదీ తరువాత బండి సంజయ్ సాగర్‌లో మకాం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను కూడా సాగర్‌కు తీసుకురావాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరో 38 మంది కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే నెలకొంది. చదవండి:6 ఎమ్మెల్సీలు ఖాళీ.. కడియంకు మళ్లీ ఛాన్స్ ఉండేనా? -
కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు: లక్ష్మణ్
- కాంగ్రెస్ నేతల చేరికలపై టీఎస్ బీజేపీ చీఫ్ వ్యాఖ్య హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజాయితీపరులను, నమ్మకస్తులను కాషాయదళంలోకి చేర్చుకుంటామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్. అంతమాత్రాన బీజేపీలో చేరాల్సిందిగా ఎవరివెంటా పడబోమని, కాంగ్రెస్‌వాళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని స్పషం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో లక్ష్మణ్ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో అధికారంలోకి రాబోయే రాష్ట్రంగా తెలంగాణను మొదటి కేటగిరీలో చర్చామని, అందుకే అమిత్ షా 3 రోజులపాటు తెలంగాణలోనే పర్యటిస్తారని లక్ష్మణ్ చెప్పారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కాగా, బీజేపీ పార్టీ పదవుల్లో కొనసాగుతూ సరిగా పని చెయ్యని వారిపై సమీక్ష నిర్వహిస్తామని, గతంలో పోటీ చేసి యాక్టివ్‌గా ఉన్నవాళ్లపేర్లను మరలా పరిశీలిస్తామన్నారు. ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్ చెప్పారు. -
'టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం'
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. 2019లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా విభజన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. కరువు చర్యల్లో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.