అమిత్‌షా ఓ అజ్ఞాని: సీఎం సిద్ధ రామయ్య | Amith Sha is a stupid: Siddha Ramaiah | Sakshi
Sakshi News home page

అమిత్‌షా ఓ అజ్ఞాని: సీఎం సిద్ధ రామయ్య

Published Fri, Jan 26 2018 7:31 PM | Last Updated on Fri, Jan 26 2018 7:31 PM

Amith Sha is a stupid: Siddha Ramaiah

సాక్షి, బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు తెలివి లేదని, ఆయన ఒక అజ్ఞాని అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. సిద్ధ రామయ్య అంటే అవినీతి.. అవినీతి అంటే సిద్ధ రామయ్య అని మైసూరులో అమిత్‌షా గురువారం చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం తన ట్విటర్‌లో విరుచుకుపడ్డారు. దోషి అయిన అమిత్‌షా మరో దోషి అయిన యడ్యూరప్పను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై, తన ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను అమిత్‌షా నిరూపించగలరా అని సవాల్‌ విసిరారు. కేవలం అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవాలని ఆయన చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రజలు అమిత్‌షా అబద్ధాలను నమ్మరన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement