బీజేపీ చీఫ్ అమిత్ షా (ఫైల్‌ఫోటో)
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ అస్వస్ధతతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్రమంలో బీజేపీ సర్కార్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు పార్టీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నర్‌ను కోరడంతో బీజేపీ అప్రమత్తమైంది. సీఎం పారికర్ కోలుకునే వరకూ భాగస్వామ్య పక్షానికి చెందిన మంత్రి సుధీన్ ధవాలికర్‌ను డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టాలన్న ప్రతిపాదనను మిత్రపక్షాలు తిరస్కరించడంతో అమిత్ షా గోవా ఫార్వార్డ్‌కు చెందిన మంత్రి విజయ్ సర్ధేశాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
మరోవైపు బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, గోవా ఫార్వార్డ్ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు, ముగ్గురు ఇండిపెండెంట్లు ఫ్రంట్‌గా ఏర్పడటంతో తదుపరి సంకీర్ణ సర్కార్ భవితవ్యాన్ని ఈ ఫ్రంట్ నిర్ధేశిస్తుందని భావిస్తున్నారు.
40 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కాగా, బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ గేమ్‌లో కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment