లంచం ఇచ్చినా పని కాలేదు: గోవా సీఎం
Published Fri, Jun 24 2016 8:16 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM
పనాజి: నేనూ లంచం బాదితున్నేనని గోవాముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. 38 ఏళ్ల క్రితం ఉత్తర గోవా జిల్లా కలెక్టరేట్ లో ఒక సర్టిఫికేట్ నిమిత్తం అక్కడి అధికారికి లంచం ఇవ్వాల్సి వచ్చిందని అయినా పని జరగలేదని అన్నారు. పనాజిలో ఎస్ఎంఎస్ సర్వీసును ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. తాను సర్టిఫికేట్ నిమిత్తం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినపుడు ఇక్కడి అధికారి ఫ్యూన్ సంప్రదించమన్నాడని అతను దానికి డబ్బు ఖర్చు అవుతుందని చెప్పాడని అన్నారు. తర్వాత ఫ్యూన్ ఉద్యోగిగా మారి రిటైర్డ్ అయ్యాడని ఆయన తెలిపారు. అయితే తాను ప్రజాప్రతినిధిగా మారిన తర్వాత లంచం ఇవ్వకుండా తన సర్టిఫికెట్ తీసుకున్నానని, ఇప్పటి వరకు లంచం అడిగిన అధికారులను కలిసే అవకాశం రాలేదని పర్సేకర్ అన్నారు.
Advertisement