‘స్వామీ.. ఎన్నాళ్లీ ఎదురు చూపులు, త్వరలో జంటగా’ : ఇన్‌ఫ్లూయెన్సర్‌పోస్ట్‌ వైరల్‌ | Woman Confesses Love To Influencer Ranveer Allahbadia In Viral Video | Sakshi
Sakshi News home page

‘స్వామీ.. ఎన్నాళ్లీ ఎదురు చూపులు, త్వరలో జంటగా’ : ఇన్‌ఫ్లూయెన్సర్‌పోస్ట్‌ వైరల్‌

Published Mon, Dec 23 2024 5:16 PM | Last Updated on Mon, Dec 23 2024 5:31 PM

Woman Confesses Love To Influencer Ranveer Allahbadia In Viral Video

బీర్‌బైసెప్స్‌గా  పాపులర్‌ అయిన కంటెంట్‌  క్రియేటర్‌  రణవీర్ అల్లాబాడియా. భారతదేశంలోని అత్యంత ప్రముఖ యూట్యూబర్  పోడ్‌కాస్టర్‌కు  ఒక మహిళా వీరాభిమాని ఉంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో  ఇంటర్నెట్‌ సంచలనంగా మారిన రణవీర్‌ను  రోహిణి అర్జు అనే అమ్మాయి విపరీతంగా అభిమానిస్తుంది.  దీనికి సంబంధించి అనేక రీల్స్‌,వీడియోలు  గతంలో నెట్టింట్‌ హల్‌చల్‌ చేశాయి.   తాజాగా  మరో వీడియోను పోస్ట్‌ చేయడం విశేషంగా నిలిచింది.

ఆ అభిమాని పేరే రోహిణి అర్జు.  ఈమె ఆధ్యాత్మికత కంటెంట్  క్రియేటర్‌. పశువైద్యురాలు. అల్లాబాడియా పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోలను పోస్ట్ చేసింది. తాజాగా "స్వామీ, నేను వేచి ఉన్నాను..."అంటూ  అతనికి ప్రపోజ్‌ చేసింది. ‘‘ఎంతమంది  వెక్కిరించినా, ఎగతాళి చేసినా,పిచ్చి అనుకున్నా, ఎక్కడ ఎలా, ఉన్నావనేదానితో సంబంధం లేకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. రణ్‌వీర్ అల్లాబాడియా.. నా స్వర్వస్వం నీవే’’ అంటే  పోస్ట్‌ చేసింది. ఆమె శరీరంపై ‘రణవీర్‌’ టాటూను కూడా గమనించవచ్చు. 

అక్కడితో ఆగలేదు. మరొక పోస్ట్‌లో, "స్వామీ,మీ కోసం జీవితకాలం వేచి ఉన్నాను, చివరకు భార్యాభర్తలుగా త్వరలో మారబోతున్నాము"  అని పేర్కొంది.  అల్లాబాడియా ఫోటోలను అల్పాహారం చేయడం, బెడ్‌ మీడ పెట్టుకుని నిద్రపోవడం దాకా రీల్స్‌ చేసింది.  దీంతో ఇది మరోసారి  నెట్టింట చర్చకు దారి తీసింది. కొంతమంది రణవీర్‌కు ట్యాగ్‌ చేస్తుండగా, మరికొంతమంది  ఈమెకు వెంటనే మానసిక చికిత్స కావాలంటూ వ్యాఖ్యానించారు.  ఇది ఎరోటోమానియా అనే  మానసిక రుగ్మత అని కొందరు,  కేవలం ఆన్‌లైన్    క్రేజ్‌, డబ్బు కోసం చేస్తున్న పని అని మరికొందరు వ్యాఖ్యానించారు. 

గతేడాది సెప్టెంబరులో,  అల్లాబాడియాకు, తనని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రకటించేసింది. ఫలితంతో సంబంధం లేకుండా తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు  తెలిపింది.  గతంలో కర్వా చౌత్ ఆచారాన్ని (పెళ్లైన మహిళలు, కొత్త పెళ్లికూతుళ్లు వ్రతం ఆచరించే)  పాటిస్తున్న వీడియోను  ఫోటోతో  షేర్‌  చేయడం వైరల్‌గా మారిన సంగతి  తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement