ఢిల్లీ: డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మెయిత్రా కేసులో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. ఆమె పార్లమెంటరీ ఖాతాను దుబాయ్ నుంచి 47 సార్లు ఉపయోగించినట్లు తెలుస్తోంది. మహవా మెయిత్రా నేడు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయి.
దుబాయ్ నుంచి మహువా ఎంపీ ఖాతా 47 సార్లు తెరవబడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భాజపా ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. మహువా అవినీతి చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎంపీలందరూ నిలబడాలని కోరారు. వ్యాపారవేత్త హీరానందానీ తన వ్యాపార ప్రయోజనాల కోసమే మహువా ఖాతాను ఉపయోగించి ఆయనే ఈ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోందని అన్నారు. పెట్టిబడిదారుల ఉపయోగాల కోసం ఎంపీల బృందం పనిచేస్తోంందా? అని దేశవ్యాప్తంగా ఎంపీలందర్ని ఉద్దేశించి ప్రశ్నించారు.
లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి టీఎంసీ ఎంపీ మహవా మెయిత్రా వ్యాపారవేత్త హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ క్రమంలో మహువాకు లంచం ఇచ్చినట్లు ఆరోపిస్తూ హీరానందానీ పేర ఓ లేఖకు చక్కర్లు కొట్టింది. వీటిని మహవా మెయిత్రా ఖండించారు. ఈ వ్యవహారంలో మహువాకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కానున్నారు.
ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్‌నాథ్ షిండే
Comments
Please login to add a commentAdd a comment