parlamentary
-
మహువా మెయిత్రా కేసులో వెలుగులోకి కీలక అంశాలు
ఢిల్లీ: డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మెయిత్రా కేసులో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. ఆమె పార్లమెంటరీ ఖాతాను దుబాయ్ నుంచి 47 సార్లు ఉపయోగించినట్లు తెలుస్తోంది. మహవా మెయిత్రా నేడు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయి. దుబాయ్ నుంచి మహువా ఎంపీ ఖాతా 47 సార్లు తెరవబడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భాజపా ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. మహువా అవినీతి చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎంపీలందరూ నిలబడాలని కోరారు. వ్యాపారవేత్త హీరానందానీ తన వ్యాపార ప్రయోజనాల కోసమే మహువా ఖాతాను ఉపయోగించి ఆయనే ఈ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోందని అన్నారు. పెట్టిబడిదారుల ఉపయోగాల కోసం ఎంపీల బృందం పనిచేస్తోంందా? అని దేశవ్యాప్తంగా ఎంపీలందర్ని ఉద్దేశించి ప్రశ్నించారు. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి టీఎంసీ ఎంపీ మహవా మెయిత్రా వ్యాపారవేత్త హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ క్రమంలో మహువాకు లంచం ఇచ్చినట్లు ఆరోపిస్తూ హీరానందానీ పేర ఓ లేఖకు చక్కర్లు కొట్టింది. వీటిని మహవా మెయిత్రా ఖండించారు. ఈ వ్యవహారంలో మహువాకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే -
కోర్టును సందర్శించనున్న పార్లమెంటరీ కమిటీ
విశాఖ లీగల్: కేంద్ర పార్లమెంట్ వ్యక్తిగత, ప్రజా సమస్యల లా అండ్ జస్టిస్ కమిటీ ఈ నెల 23న నగరంలో పర్యటించనుంది. ఈ మేరకు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైద్యుల నవీంద్ర ప్రసాద్, సీనియర్ న్యాయవాది నాదెళ్ల వెంకటసుమన్ మంగళవారం కమిటీ సభ్యులను కలిశారు. కమిటీలో సునీల్‌కుమార్ మోదీ(బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి), కమిటీ చైర్మన్ కనకమేడల రవీంద్ర కుమార్‌లు ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఈ నెల 23న విశాఖ జిల్లా కోర్టును సందర్శిస్తారు. కోర్టులో మౌలిక సదుపాయాలు, భవనాలు, ఇరత అంశాలను పరిశీలించి పార్లమెంట్‌కి నివేదిక సమర్పిస్తారు. (చదవండి: దర్జీ సంతసం) -
భూసేకరణపై 8 గంటల చర్చ
న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై లోక్‌సభ సోమవారం ఎనిమిది గంటలపాటు చర్చించనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మలివిడత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా.. ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకువచ్చిన బిల్లులు, రైల్వే, సాధారణ బడ్జెట్లపై ఉభయ సభల్లో చర్చ జరుగుతుందని వివరించింది. లోక్‌సభ కార్యక్రమాల్లో భూసేకరణ బిల్లుపై చర్చతోపాటు రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌పై చర్చ, ఓటింగ్ ఉంటుందని పేర్కొంది. దేశంలో రైతుల పరిస్థితిపై కూడా చర్చ ఉంటుందని వెల్లడించింది. ఇక సోమవారం రాజ్యసభలో ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన గనులు, ఖనిజాలు(అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు-2015, మోటార్ వాహనాల (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు బిల్లులకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. మోటార్ వాహనాల బిల్లు రాజ్యసభలో ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. దీంతోపాటు మరో రెండు బిల్లులు (బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు, ఈ-వేలం ద్వారా బొగ్గు గనుల విక్రయం) కూడా రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(సవరణ) బిల్లు-2014 కూడా ఇదే సమావేశాల్లో రాజ్యసభ ముందుకు రానుంది. దీన్ని లోక్‌సభ ఇప్పటికే ఆమోదించింది. ఇటీవల తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు మార్చి 20లోగా పార్లమెంట్ ఆమోదముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 5 నాటికల్లా ఆమోదం పొందలేకపోతే ఈ ఆర్డినెన్స్‌లు రద్దయిపోతాయి. మార్చి 20న పార్లమెంట్ వాయిదా పడనుంది. తిరిగి ఏప్రిల్ 20 నుంచి మళ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.