లాక్‌డౌన్‌ పొడిగింపు తప్పదన్న సీఎం | Goa CM Says Lockdown Must Be Extended For 15 Days | Sakshi
Sakshi News home page

‘మరో రెండు వారాలు లాక్‌డౌన్‌’

Published Fri, May 29 2020 3:41 PM | Last Updated on Fri, May 29 2020 3:42 PM

Goa CM Says Lockdown Must Be Extended For 15 Days - Sakshi

పనాజీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. మే 31తో ముగిసే లాక్‌డౌన్‌ను 15 రోజులు పొడిగించాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఫోన్‌లో కోరానని చెప్పారు. అయితే లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇవ్వాలని సూచించారు.

రెస్టారెంట్లను 50 శాతం సీట్లతో భౌతిక దూరం పాటిస్తూ అనుమతించాలని కోరారు. జిమ్‌లను కూడా తెరవాలని పలువురు కోరుతున్నారని గోవా సీఎం చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ గ్రాఫ్‌ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,000కు చేరింది.

చదవండి : హీరోయిన్‌ మాజీ భర్త ప్రేమలో మసాబా!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement