'మైనింగ్ లాబీకి ముఖ్యమంత్రి వత్తాసు'
పానాజీ: గోవాలోని మైనింగ్ లాబీకి ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ వత్తాసు పలుకుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపణలు సంధించింది. మైనింగ్ అక్రమాలను
అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఓ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆప్ డిమాండ్ చేసింది.
ప్రైవేట్ కంపెనీల చెర నుంచి సహజ వనరులకు ముక్తి కలిగించాలని ఆప్ సూచించింది. గత రెండేళ్లుగా మైనింగ్ తవ్వకాలపై నిషేధం విధించిన గోవా సీఎం ఓ గుణపాఠం నేర్చుకున్నారని ఆప్ చురకలంటించింది. ప్రైవేట్ సంస్థలకు వత్తాసు పలకవద్దని గోవా సీఎంకు ఆప్ విజ్ఞప్తి చేసింది.
సహజ వనరులను కేవలం తవ్వకాలకే పరిమితం చేయకుండా చర్యలు తీసుకుంటామని గతవారం గోవా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. ముడి ఇనుమును స్టీల్ గా తయారు చేయానికి పరిశ్రమను ఏర్పాటు చేస్తే స్థానికులు భారీ సంఖ్యలో ఉద్యోగాలతోపాటు, స్థానిక ఆర్ధిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ఆప్ సూచించింది.