
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పారికర్ ని ప్రకటించండి:ఆప్
పణజీ: బీజేపీ తన ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీకి బదులు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను ప్రకటిస్తే బాగుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ అభిప్రాయపడింది. బీజేపీ చేసిన తప్పు ఇప్పటికైనా తెలుసుకుని, మనోహర్ పారికర్ ను ప్రధానిగా బరిలో దించాలని తెలిపింది. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు దినేష్ వాఘేలా బీజేపీకి సూచించారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన అభివృద్ధిపై మోడీ చెబుతున్న మాటలన్నీ అసత్యలేనని దుయ్యబట్టారు.
దేశంలో ఒకే నాణానికి రెండు ముఖలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు అవినీతి ప్రాబల్యం పెరగకుండా చూడాలన్నారు. గోవా సీఎంగా ఉన్న మనోహర్ నిరాడంబరుడని, ఆయన ఢిల్లీలో ఉంటే దేశం మొత్తం ఉంటే బాగుంటుందని దినేష్ తెలిపారు. నిన్నటి సభలో ఆప్ పై మోడీ విమర్శలు గుప్పించారు. దేశంలోని వార్తపత్రికలకు, ఛానళ్లకు ఢిల్లీ రాజకీయాలే తప్ప మరేదీ కనిపించడం లేదన్నారు. ఆప్ కు మీడియా అధిక ప్రాధాన్యత కల్పించడాన్ని మోడీ తప్పుబట్టారు.