
అనవసరంగా జోక్యం చేసుకోవద్దు: పారికర్
పనాజీ: బీజేపీ ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎవరని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రశ్నించారు. ఎవరిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనేది తమ పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఒకవేళ పార్టీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే తాను ఆలోచిస్తానని అన్నారు.
నరేంద్ర మోడీని కాకుండా మనోహర్ పారికర్ను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని స్థానిక ఆప్ నాయకుడొకరు చేసిన వ్యాఖ్యలపై ఆయనీ విధంగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోరాదన్నారు.