
యూపీ నుంచి రాజ్యసభకు పారికర్!
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రక్షణ మంత్రిత్వ శాఖను ఆయన చేపడతారని వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత శనివారం సీఎం పదవికి ఆయన రాజీనామా సమర్పిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆయనను పంపించే అవకాశముందని తెలిపాయి. త్వరలోనే ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, శనివారం సాయంత్రం గోవా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని మనోహర్ పారికర్ తెలిపారు.