తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ సింఘ్వీ | Abhishek Manu Singhvi As Congress Candidate For Rajya Sabha In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ సింఘ్వీ

Published Wed, Aug 14 2024 6:05 PM | Last Updated on Wed, Aug 14 2024 6:20 PM

Abhishek Manu Singhvi As Congress Candidate For Rajya Sabha In Telangana

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

కాగా, తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థితత్వాన్ని ఏఐసీసీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు. 

కాగా రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు మూడో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇక, ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో, వారంతా రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement