
న్యూఢిల్లీ: 41 రోజుల పాటు ఐహిక వాంఛలకు దూరంగా ఉండి, అనంతరం శబరిమల ఆలయాన్ని దర్శించాల న్న నిబంధన అసాధ్యమైన, ఆచరణ సాధ్యం కానిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం లేదన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం వాదనలు కొనసాగాయి. ‘కేవలం 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న మహిళలకు మినహాయించి.. ఈ దేవాలయంలోకి అన్ని కులాలు, మతాల వారికి ప్రవేశం ఉంది. ఈ ఆలయ సందర్శనకు ముందు 41 రోజుల పాటు పవిత్రంగా, ఐహిక వాంఛలకు దూరంగా ఉండటం మహిళలకు సాధ్యంకాకపోవడమే వారిని అనుమతించకపోవడానికి కారణం’ అని ధర్మాసనానికి దేవస్థానం తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment