
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జడ్జీలు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది.
పిటిషనర్ అయిన జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షులు శైలజా విజయన్ తరఫు లాయరు మాథ్యూస్ నెడుంపరా వాదనలు వినిపించారు. అయితే, సాధారణ పిటిషన్ల మాదిరిగా దీన్ని కూడా పరిగణిస్తామని దసరా సెలవుల తర్వాతే విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment