
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్ర్తీలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇటీవల వెల్లడించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్థిష్ట సమయంలోనే రివ్యూ పిటిషన్లు విచారణకు వస్తాయని స్పష్టం చేసింది. శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను ఇప్పటికిప్పుడు విచారించలేమని తేల్చిచెప్పింది.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును పలు మహిళా సంఘాలు స్వాగతించగా, హిందూ సంస్ధలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని, తీర్పును అమలు చేసేందుకు చర్యలు చేపడతామని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment