చారుహాసన్
తమిళనాడు, పెరంబూరు: శబరిమల ఆలయ ప్రవేశంపై నటుడు చారుహాసన్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దేశంలో రగులుతున్న అంశాల్లో కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ సమస్య ఒకటి. అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు వివాదంగా మారింది. అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మహిళలు పలువురు అయ్యప్ప సన్నిధికి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు.
అయితే అక్కడి భక్తులు మహిళలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నటు డు కమలహాసన్ తానెప్పుడూ అయ్యప్ప ఆలయాన్ని దర్శించలేదని, కాబట్టి తెలియని విషయం గురించి ఎలా స్పందించనని తెలివిగా తప్పించుకున్నారు. అయితే ఆయన సోదరుడు చారుహాసన్ మాత్రం మహిళలకు అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. మహిళలు అయ్యప్ప కొండకు వెళ్లడం అనేది పురుషుల మరుగుదొడ్డిని మహిళలు ఉపయోగించుకోవడం లాంటిదని చారుహాసన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment