న్యూఢిల్లీ: శబరిమలై ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాది నౌషాద్ అహ్మద్ ఖాన్ కు వచ్చిన బెదిరింపులపై ఉన్నత న్యాయస్థానం సోమవారం స్పందించింది. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఖాన్ దాఖలు చేసిన పిటీషన్ను ఆమోదించిన సుప్రీం అహ్మద్ ఖాన్కు రక్షణ కల్సించాలని డిల్లీ పోలీసులను ఆదేశించింది.
కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10-50 సం.రాల మహిళా భక్తుల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై భారత యువ లాయర్ల సంఘం అధ్యక్షుడు ఖాన్ పిటిషన్ దాఖలుచేశారు. అయితే పిటిషన్ ను ఉపసంహరించుకోవాల్సిందిగా బెదిరిస్తూ తనకు సుమారు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని నౌషాద్ గత శుక్రవారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు తమ ఇంటిని పేల్చి వేస్తామని, తనను మట్టుబెడతామని హెచ్చరించినట్టుగా సుప్రీంకు తెలియజేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం తాజా ఆదేశాలు జారీ చేసింది.
కాగా కేరళలో ప్రముఖ అయ్యప్ప క్షేత్రం శబరిమలైలో కేవలం పదేళ్ల లోపు అమ్మాయిలను, 50 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఆలయంలో ప్రవేశించడానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ న్వి రమణలతో కూడిన ధర్మాసనం శబరిమల అయ్యప్ప దేవాయలం ట్రస్ట్ వివరణ ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.
ఆ లాయర్కు రక్షణ కల్పించండి
Published Mon, Jan 18 2016 3:13 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement