women devotees
-
51 మంది మహిళలు దర్శించుకున్నారు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: రుతుస్రావ వయసులో ఉన్న 51 మంది మహిళలు ఇప్పటివరకూ శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి అఫిడవిట్‌ను సమర్పించింది. కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హన్సరియా వాదిస్తూ.. స్వామివారి దర్శనం కోసం రుతుస్రావ వయసులో ఉన్న 7,564 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 51 మంది దర్శనం చేసుకున్నారన్నారు. తప్పులతడకగా అఫిడవిట్.. కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో అయ్యప్పను దర్శించుకున్న మహిళల ఆధార్, టెలిఫోన్ నంబర్లను బహిర్గతం చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తమిళనాడుకు చెందిన పరంజ్యోతి(47) అనే పురుషుడి పేరును కేరళ ప్రభుత్వం అఫిడవిట్లో చేర్చినట్లు బయపడింది. అలాగే అఫిడవిట్లో పేర్కొన్న కళావతి మనోహర్ వయస్సు 52 సంవత్సరాలనీ, 43 ఏళ్లు కాదని ఆమె కొడుకు చెప్పారు. ఆ మహిళలకు రక్షణ కల్పించండి.. అయ్యప్పస్వామిని దర్శించుకున్న బిందు(42), కనకదుర్గ(44)లకు భద్రత కల్పించాలని కేరళ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. బిందు, కనకదుర్గల భద్రత మినహా ఈ రిట్ పిటిషన్లో తాము ఇతర అంశాల జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేరళ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ బిందు ఇంటివద్ద నలుగురు అధికారులు, అత్తచేతిలో దాడికి గురై ఆసుపత్రిలో ఉన్న కనకదుర్గకు 19 మందితో రక్షణ కల్పిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బిందు కోజికోడ్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా, కనకదుర్గ పౌరసరఫరాల విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ఆ లాయర్‌కు రక్షణ కల్పించండి
న్యూఢిల్లీ: శబరిమలై ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాది నౌషాద్ అహ్మద్ ఖాన్ కు వచ్చిన బెదిరింపులపై ఉన్నత న్యాయస్థానం సోమవారం స్పందించింది. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఖాన్ దాఖలు చేసిన పిటీషన్‌ను ఆమోదించిన సుప్రీం అహ్మద్ ఖాన్‌కు రక్షణ కల్సించాలని డిల్లీ పోలీసులను ఆదేశించింది. కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10-50 సం.రాల మహిళా భక్తుల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై భారత యువ లాయర్ల సంఘం అధ్యక్షుడు ఖాన్ పిటిషన్ దాఖలుచేశారు. అయితే పిటిషన్ ను ఉపసంహరించుకోవాల్సిందిగా బెదిరిస్తూ తనకు సుమారు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని నౌషాద్ గత శుక్రవారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు తమ ఇంటిని పేల్చి వేస్తామని, తనను మట్టుబెడతామని హెచ్చరించినట్టుగా సుప్రీంకు తెలియజేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా కేరళలో ప్రముఖ అయ్యప్ప క్షేత్రం శబరిమలైలో కేవలం పదేళ్ల లోపు అమ్మాయిలను, 50 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఆలయంలో ప్రవేశించడానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ న్వి రమణలతో కూడిన ధర్మాసనం శబరిమల అయ్యప్ప దేవాయలం ట్రస్ట్ వివరణ ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. -
మీ ఇంటిని పేల్చేస్తాం...చంపేస్తాం
తిరువనంతపురం: శబరిమలై ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నన్యాయవాది నౌషాద్ అహ్మద్ ఖాన్ ని చంపేస్తామంటూ కొంతమంది హెచ్చరించడం కలకలం రేపింది. కొన్ని వందల కాల్స్ రావడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. భారత యువ లాయర్ల సంఘం అధ్యక్షుడు ఖాన్ ఈ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. పిటిషన్ వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఆయన శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తూ సుమారు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని నౌషాద్ ఇవాళ కోర్టుకు తెలిపారు. లేదంటే తమ ఇంటిని పేల్చి వేస్తామని, తనను మట్టుబెడతామని హెచ్చరించినట్టుగా సుప్రీంకు తెలియజేశారు. అందులో అమెరికా నుంచే ఎక్కువ కాల్స్ వచ్చినట్లు ఆ లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే లాయర్ తాజా పిటిషన్‌ను వి చారణకు స్వీకరించిన సుప్రీం సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఖాన్‌కు కల్పించాల్సిన రక్షణ తదితర విషయాలపై కోర్టు తన తీర్పును వెల్లడించనుంది. అటు అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10-50 సం.రాల మహిళా భక్తుల ప్రవేశాన్ని నిషేధంపై ఇటీవల వివాదం రేగింది. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న సుప్రీం వివరణ ఇవ్వాలని శబరిమల అయ్యప్ప దేవాయలం ట్రస్ట్ ను కోరింది. జస్టిస్ దీపక్ మిశ్రా, ఎన్వి రమణలతో కూడిన ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. కాగా కేరళలో ప్రముఖ అయ్యప్ప క్షేత్రం శబరిమలైలో కేవలం పదేళ్ల లోపు అమ్మాయిలను, 50 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఆలయంలో ప్రవేశించడానికి అనుమతిస్తారు. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది ఖాన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.