
శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశనలుమూలల నుంచి తరలివచ్చిన స్వామలు మణికంఠుని దర్శించుకుంటున్నారు. స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో శబరిమల హోరెత్తుతోంది. మండల పూజల కోసం నిన్న శబరిమల దేవాలయ ద్వారాలు తెరుచుకున్నాయి. డిసెంబర్ 27 వరకు అయప్పస్వామికి నిత్యపూజలు జరుగుతాయి. నాలుగు రోజుల విరామం తర్వాత మళ్లీ జ్యోతి దర్శనం వరకూ స్వామి ఆలయం తెరిచి ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేరళప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసింది. శబరిమల సంప్రదాయాలను అతిక్రమించే ఎలాంటి చర్యలను సహించబోమని కేరళ దేవాదాయ శాఖ ముందే స్పష్టం చేసింది.