నిర్వాసితులకు అండగా సీపీఎం పోరుబాట
సాక్షి, హైదరాబాద్: భూ నిర్వాసితులు, ఉపాధిని కోల్పోతున్న వారి సమస్యలపై మరింత తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయాలని సీపీఎం నిర్ణయించింది. నీటిపారుదల ప్రాజెక్టులు, వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణను, పునరావాస ప్యాకేజీని కచ్చితంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారమే చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించింది. రాష్ర్టవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ చేపడుతున్నచోట్ల 2013చట్టం ప్రకారమే పరిహారం అందించాలంటూ స్థానిక తహసీల్దార్లకు భూమి కోల్పోతున్న రైతులు, ఉపాధిని కోల్పోతున్న వ్యవసాయ కూలీలు, వివిధ వృత్తుల వారు దరఖాస్తులను సమర్పిం చేలా కార్యాచరణను అమలుచేస్తోంది.
తర్వాత ఆ దరఖాస్తుల ప్రతులను హైకోర్టుకు సమర్పించేలా చర్యలు చేపడుతోంది. దాంతోపాటే డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది.