Land Expats
-
అపార్ట్‌మెంట్‌పైనే ‘అమృత్’ పంటలు!
ఈ నెల 5న ప్రపంచ భూముల దినోత్సవం సందర్భంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించుకుంటూనే భూసారాన్ని పెంపొందించుకుంటున్న అన్నదాతలతోపాటు.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న డాక్టర్ మేధా శ్రీంగార్‌పురే అనే సిటీ ఫార్మర్కు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం.. ఎందుకంటే.. పంట భూములకు దూరంగా కాంక్రీటు అరణ్యంలో నివాసం ఉంటున్న ఆమె తమ వంటింటి వ్యర్థాలను, చెరకు పిప్పిని ఉపయోగించి తమ అపార్ట్మెంటు మేడ పైనే ఆమె ‘అమృత్ మిట్టి’ని తయారు చేస్తున్నారు. అత్యంత సారవంతమైన అమృత్ మిట్టితో అద్భుత పోషక విలువలున్న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అనేక ఏళ్లుగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా, మహానగర జీవులకు ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై చెత్త భారాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతున్నారు. అంతేకాదు, ఆవు పేడ – మూత్రంలతో ద్రవ రూప ఎరువు ‘అమృత్ జల్’ను తయారు చేసుకొని వాడుతూ అమృతాహారాన్ని పండించుకుంటున్నారు. కూరగాయలు.. పండ్లు.. ముంబై నగరంలోని మాజ్గవ్ టెర్రస్ అనే సొసైటీలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో దంత వైద్యురాలు మేధా శ్రీంగార్‌పురే రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆమె తమ అపార్ట్మెంట్ భవనం టెర్రస్‌పైనే సిటీ ఫార్మింగ్ చేస్తున్నారు. తన ఇంట్లోని కిటికీలతోపాటు ముఖ్యంగా టెర్రస్‌ను 150 నుంచి 200 రకాల మొక్కలతో నందనవనంగా మార్చారు. ప్రస్తుతం పండ్లలో జామపండ్లు, సీతఫలం, చెర్రీ పండ్లు, బత్తాయి పండ్లు ఇలా అనేక రకాల పండ్ల చెట్లతోపాటు ఆకు కూరలు, సీజనల్ కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, మునగకాయలు, పలు రకాల మిరపకాయలు, పుష్పాలు ఇలా అనేక రకాలు ఆమె ఇంటిపంటల్లో కనిపిస్తున్నాయి. ఇతర భవనాల టెర్రస్లపైనా... మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీలో అన్ని భవనాలూ నాలుగు అంతస్తులవే ఉన్నాయి. డా. మేధా ఉండే భవనం టెర్రస్‌పై ఇంటిపంటల సాగులో మంచి ఫలితాలు కన్పించడంతో ఇతర భవనాల వారు కూడా వారి వారి టెర్రస్లపైనా మొక్కలు నాటేందుకు ఆసక్తిచూపారు. రసాయనాలు లేకుండా పండే కూరగాయలను తింటే ఎంతో రుచితోపాటు మాటల్లో చెప్పలేని ఆరోగ్యం, ఆనందం కలుగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు.. శని, ఆదివారాలలో 4 గంటల సమయం కేటాయిస్తున్నా. ఇదంతా చేయడానికి శ్రద్ధ చాలా అవసరం అంటారు డా. మేధా. అపార్ట్మెంట్లో అందరి అనుమతితోనే.. వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సహజ సేంద్రియ ఎరువు ‘అమృత మిట్టి’ మా ఇంట్లో చాలా పోగైంది. దీన్ని ఏమి చేయాలని ఆలోచించగా టెర్రస్‌పై కూరగాయ మొక్కలు పెంచవచ్చన్న ఆలోచన వచ్చింది. అంతే భవనంలోని అన్ని అంతస్తులలో నివసించే వారిని సంప్రదించి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నా. సొసైటీ బాధ్యులతో చర్చలు జరిపి అన్ని అనుమతులు పొంది టెర్రస్‌పై అయిదేళ్ల కిందట సేంద్రియ పంటలు పెంచడం ప్రారంభించా. ఆ కొత్తలోనే అర్బన్ లీవ్స్ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొని అనేక మెళకువలు తెలుసుకున్నా. అర్బన్ లీవ్స్‌కు వాలంటీర్‌గా సేవలందించడంతో అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలిసివచ్చాయి. దీంతో రెండేళ్లలోనే టెర్రస్‌పై పెంచిన మొక్కలు చక్కని దిగుబడినివ్వటం ప్రారంభమైంది. . – డా. మేధా శ్రీంగార్‌పురే (98695 48090), మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీ, ముంబై ముంబైలో అర్బన్ లీవ్స్ సంస్థ టెర్రస్‌పై నెలకొల్పిన ఒక కమ్యూనిటీ గార్డెన్ – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
గుడి చుట్టూ అధికార దొంగలు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల దోపిడీకి గుడి, బడి ఏదీ తేడా లేకుండా పోతోంది. ఆలూరు మండలం హత్తిబెళగల్‌కు సమీపంలో శుక్రవారం జరిగిన పేలుడు సంఘటన చుట్టూ పరిణామాలను గమనిస్తే మరిన్ని వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఈ పేలుడు ప్రాంతానికి సమీపంలోనే సోమేశ్వర ఆలయం ఉంది. కొండపై ఉన్న ఈ ఆలయం చుట్టూ ఉన్న కొండను సైతం పేలుస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు. క్వారీ లీజు తీసుకున్న ప్రాంతానికి దూరంగా గుడి చుట్టూ ఉన్న రాయిని డిటోనేటర్లతో పగలగొడుతున్నారు. అలాగే గుడిచుట్టూ అధికారపార్టీ నేతలు గుంతలు వేస్తున్నారు. తీసుకున్న లీజు ప్రాంతం కొంత మేర ఉంటే.. అంతా తమదే అన్నట్టు సోమేశ్వర ఆలయం చుట్టూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతుండడాన్ని అక్కడి ప్రజలు తప్పుపడుతున్నారు. అధికారులు మాత్రం కనీసం అటువైపుగా కన్నెత్తి చూడటం లేదు. పైగా మైనింగ్ అధికారులు కొందరు.. ఈ అధికారపార్టీ నేతకు చెందిన మైనింగ్ ప్రాంతంలోనే కొద్దిరోజుల క్రితం భారీగా ‘పార్టీ’ చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో పేలుళ్లకు పాల్పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అధికారపార్టీ ఒత్తిళ్లతో పాటు భారీగా మామూళ్లు ముడుతుండటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుడి చుట్టూ గుంతలు గుప్తనిధుల కోసం జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో పీర్ల గుడికి సమీపంలో నేరుగా ప్రభుత్వమే తవ్వకాలు చేపట్టింది. నెలల తరబడి ఈ తంతు సాగుతోంది. ఎక్కడ కనబడితే అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. కనీసం పురావస్తు శాఖ నుంచి అనుమతి కూడా లేదు. కేవలం కలెక్టర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే ఈ తతంగం సాగుతోంది. ఇప్పుడు అధికారపార్టీ నేతలు కూడా ఆలూరు మండలం హత్తిబెళగల్‌కు సమీపంలో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయం చుట్టూ తవ్వకాలు చేపట్టారు. క్వారీ కోసం లీజుకు తీసుకున్న భూమితో సంబంధం లేకుండా ఈ తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు (ఈడీ) పెట్టి గుడిచుట్టూ ఉన్న బండలను పేల్చేశారు. ఆలయం కింద నుంచి ఆలయానికి వెళ్లే మార్గం వరకూ అనధికారికంగా తవ్వకాలు చేశారు. హత్తిబెళగల్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ అక్రమ పేలుళ్లపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. శుక్రవారం జరిగిన పేలుడు సంఘటన కూడా ఆలయానికి సమీపంలోనే చోటుచేసుకుంది. ఈ ఆలయానికి ప్రతి సోమవారం, అలాగే పౌర్ణమి, అమావాస్య రోజున చుట్టుపక్కల నుంచి భారీగా జనం వస్తుంటారు. రాత్రి సమయాల్లో గుడి సమీపంలోనే 100 మంది వరకూ నిద్రిస్తుంటారు. ఒక రాత్రి నిద్ర చేసిన తర్వాత వెళ్లడం ఆనవాయితీ. ఒకవేళ శుక్రవారం రాత్రి జరిగిన పేలుడు కాస్తా సోమవారం జరిగి ఉంటే మా పరిస్థితి ఏమిటంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊహించుకుని భీతిల్లుతున్నారు. -
నిర్వాసితులకు అండగా సీపీఎం పోరుబాట
సాక్షి, హైదరాబాద్: భూ నిర్వాసితులు, ఉపాధిని కోల్పోతున్న వారి సమస్యలపై మరింత తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయాలని సీపీఎం నిర్ణయించింది. నీటిపారుదల ప్రాజెక్టులు, వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణను, పునరావాస ప్యాకేజీని కచ్చితంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారమే చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించింది. రాష్ర్టవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ చేపడుతున్నచోట్ల 2013చట్టం ప్రకారమే పరిహారం అందించాలంటూ స్థానిక తహసీల్దార్లకు భూమి కోల్పోతున్న రైతులు, ఉపాధిని కోల్పోతున్న వ్యవసాయ కూలీలు, వివిధ వృత్తుల వారు దరఖాస్తులను సమర్పిం చేలా కార్యాచరణను అమలుచేస్తోంది. తర్వాత ఆ దరఖాస్తుల ప్రతులను హైకోర్టుకు సమర్పించేలా చర్యలు చేపడుతోంది. దాంతోపాటే డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది.