
చలికి పాలు
చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. దీనిని నివారించడానికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్యూటిప్స్
చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. దీనిని నివారించడానికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా పొడి చర్మంతో బాధపడేవారు అందుబాటులో లభించే సాధనాలతో, ఈ కింది మాస్క్ తయారుచేసుకుని ఉపయోగిస్తే చాలు... మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
మిల్క్ మాస్క్: పాలపొడి - టీ స్పూన్ బాదం పేస్ట్ - టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ -టేబుల్ స్పూన్ తేనె - టేబుల్ స్పూన్ ఎసెన్షియల్ ఆయిల్ - రెండు చుక్కలు పై పదార్థాలన్నీ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగెయ్యాలి.