అత్యాచార ఘటనలను నిరసిస్తూ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో చిన్నారుల ఆందోళన...
న్యూఢిల్లీ: వరసగా వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. రాజధాని ఢిల్లీ, అహ్మదాబాద్, అమృత్‌సర్, మొరాదాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబై తదితర నగరాల్లో ఆదివారం నిరసనలు మిన్నంటాయి. ఉన్నావ్, కఠువా ఉదంతాల్లో దోషులకు శిక్ష విధించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ నినాదాలు మార్మోగాయి. ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్‌లో ‘నాట్ ఇన్ మై నేమ్’ పేరిట నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, కళాకారులు రేప్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ను కాపాడటానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కఠువా కేసులో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు భద్రత పెంచాలని, వారి తరఫున వాదించేందుకు ప్రభుత్వమే సమర్థవంతమైన లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేయాలని కోరారు.
అహ్మదాబాద్‌లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మదరసా విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment