protest march
-
కూలిన శివాజీ విగ్రహం: నిరసనకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
ముంబై: గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహా ఆగస్టు 26 కుప్పకూలింది. ఈ విగ్రహం కూలిపోవటంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్ష మహా వికాస్ అఘాడి తప్పుపడుతూ సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. శివాజీ విగ్రహం కూలిపోవటంపై సెప్టెంబర్ 1న నిరసన ర్యాలీని చేపడతామని బుధవారం మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి హుతాత్మా చౌక్ నుంచి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, నానా పటోల్, సంజయ్ రౌత్‌లు సమావేశమైన అనంతరం నిరసన ర్యాలీని ప్రకటించారు.మరోవైపు.. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం శివాజీ విగ్రహ నిర్మాణం, ఏర్పాటు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఉద్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు.ఈ ఘటనకు ప్రభుత్వం, నేవి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక.. విగ్రహం కూలడంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘శివాజీ మహారాజ్ మనందరి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు. -
‘దమ్ముంటే నా సర్కార్‌ను కూల్చండి’
కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయనందుకు తన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వివాదాస్పద పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. బెంగాల్లో పౌర సవరణ చట్టం, ఎన్ఆర్సీలను తాను అమలు చేసే ప్రసక్తే లేదని, కేంద్రం తన ప్రభుత్వాన్ని కూలదోయవచ్చని ఆమె సవాల్ విసిరారు. మమతా బెనర్జీ ఒంటరి అని వారు అనుకుంటున్నారని, కానీ మీరంతా తన వెంట ఉన్నారని, మన పోరాటం సరైనదైతే ప్రజలంతా వెంట వస్తారని అన్నారు. తమది మతం ఆధారంగా జరిగే పోరాటం కాదని, సరైన మార్గం కోసం జరిగే పోరాటమని స్పష్టం చేశారు. మరోవైపు మమతా బెనర్జీ మార్చ్‌ను రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ జగ్దీప్ ధంకర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంచే చట్టంగా రూపొందిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీఎం, మంత్రులు నిరసన ర్యాలీ చేపట్టడం రాజ్యాంగవిరుద్ధమని, రెచ్చగొట్టే చర్యని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కట్టలు తెంచుకున్న ఆక్రోశం
న్యూఢిల్లీ: వరసగా వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. రాజధాని ఢిల్లీ, అహ్మదాబాద్, అమృత్సర్, మొరాదాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబై తదితర నగరాల్లో ఆదివారం నిరసనలు మిన్నంటాయి. ఉన్నావ్, కఠువా ఉదంతాల్లో దోషులకు శిక్ష విధించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ నినాదాలు మార్మోగాయి. ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్‌లో ‘నాట్ ఇన్ మై నేమ్’ పేరిట నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, కళాకారులు రేప్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ను కాపాడటానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కఠువా కేసులో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు భద్రత పెంచాలని, వారి తరఫున వాదించేందుకు ప్రభుత్వమే సమర్థవంతమైన లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అహ్మదాబాద్‌లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మదరసా విద్యార్థులు -
ఢిల్లీలో కదం తోక్కిన జర్నలిస్టులు
-
బ్యాంకు ఉద్యోగుల మార్చ్ టు పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) విలీనం, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై బ్యాంకు ఉద్యోగులు మరోసారి నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఢిల్లీ వేదికగా బ్యాంకు ఉద్యోగులు తమ పోరుకు దిగనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15 న ‘పార్లమెంట్ మార్చ్’ నిర్వహించనున్నట్టు బ్యాంకుల సంఘాలు ప్రకటించాయి. సెప్టెంబరు 15న వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు బ్యాంక్ ఉద్యోగులు 'పార్లమెంటుకు మార్చ్' నిర్వహించనున్నట్లు ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దీపక్ కుమార్ శర్మ (చండీగఢ్ సర్కిల్) చెప్పారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి సిబ్బంది కొరత, దీర్ఘకాలిక నిధుల రికవరీ, ఎఫ్ఆర్డీఐ బిల్లు ఉపసంహరణ, ప్రజలపై భారం మోపుతున్న సర్వీస్ చార్జీల తగ్గింపు, డీమానిటైజేషన్ కాలానికి తమకు రావాల్సిన పరిహారం తదితర అంశాలపై ఈ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 22 న విజయవంతమైన అఖిల భారత సమ్మె తర్వాత, ఇండస్ట్రీ అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ' పార్లమెంట్ మార్చ్'కు పిలుపునిచ్చారని తెలిపారు. ఎస్బీఐ బ్యాంకుల విలీనం తదితరాలపై రాబోయే రెండు మూడు నెలల్లో దీనిపై తమ తీవ్ర నిరసనను తెలయజేయనున్నామని చెప్పారు. కార్పొరేట్ రంగం సృష్టించిన భారీ ఎన్పీఏలపై ఆయన మండిపడ్డారు. బలమైన రాజకీయ సంకల్పం, కఠినమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లేకపోవడంతో రుణాలను తిరిగి పొందడంలో బ్యాంకర్లు విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఆందోళనకర స్థాయికి చేరుకున్న మొండి బకాయిల సమస్యను సరిదిద్దే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయట్లేదని ఆయన విమర్శించారు. పెరుగుతున్న ఎన్పీఎలను హైలైట్ చేయడం ద్వారా బ్యాంకుల పనితీరును ప్రభుత్వం నిరంతరం విమర్శిస్తోందని, తద్వారా బ్యాంకులను ప్రైవేటీకరించే యోచనలో వేగంగా కదులుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నవంబర్ 1, 2017 నాటికి కొత్త వేతన రివిజన్ చేయాల్సి ఉందనీ, దీనిపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబిఎ) స్పందించనుందని తెలిపారు.