ఆరు నెలల కార్యాచరణ ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసు కుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధా నాలపై దశలవారీ ఆందోళనలు, నిరసనలకు సీపీఐ సిద్ధమవుతోంది. ఓవైపు సంస్థాగతం గా పార్టీని పటిష్టపరుస్తూనే, మరోవైపు సమ స్యలపై పోరాటానికి సిద్ధమయ్యేలా కార్యక్ర మాలు రూపొందించుకుంది. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుపై ఆరు నెలల కార్యాచరణ ప్రణాళికలకు పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. కార్యక్రమాల నిర్వహణకు మూడు కమిటీలు ఏర్పాటు చేసింది.
ప్రచార కార్యక్రమాలు, ఆందోళన రూపాల సమన్వ య కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సమన్వయ కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, కార్యక్రమాల ఏర్పాట్ల కమిటీకి శ్రీనివాసరావు, ఆదిరెడ్డి, బాలమల్లేశ్‌లను నియమించారు. ఈ నెలలో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టి కింది స్థాయి లోని సమస్యలు, పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించాలని తీర్మానించింది. మార్చిలో గ్రామ స్థాయిలో పాదయాత్రలు, ఏప్రిల్–మేలలో రాష్ట్రంలోని అన్ని మండలాలను చుట్టివచ్చేలా బస్సుయాత్ర, జూన్‌లో తెలంగాణ దిగ్భంధం (బ్లాకేడ్), ఎక్కడికక్కడ మానవహారాల ఏర్పాటును చేయనున్నారు.