న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలో ఈ నెల 23న (సోమవారం) ఢిల్లీలోని గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహం కార్యక్రమం చేపట్టనున్నారు. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకూ ఈ ధర్నా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆదివారమే ఈ ధర్నా చేపట్టాలని ముందుగా భావించినప్పటికీ అనుమతులు పొందే క్రమంలో ఆలస్యం వల్ల సోమవారం నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ చెప్పారు.
రేపు రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’
Published Sun, Dec 22 2019 3:25 AM | Last Updated on Sun, Dec 22 2019 3:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment