Rashmika Mandanna About Her Parents And Financial Status In Childhood - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్‌ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక

Published Fri, Nov 18 2022 12:41 PM | Last Updated on Fri, Nov 18 2022 1:16 PM

Rashmika Mandanna About Her Parents Financial Status in Childhood - Sakshi

అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి రష్మిక మందన్నా. కోట్లలో పారితోషికం డిమాండ్‌ చేస్తున్న ఈ బ్యూటీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుని ఇటీవల బాలీవుడ్‌కు పరిచయమైంది. అక్కడ నటించిన గుడ్‌ బై చిత్రం నటిగా ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టినా ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్న మరో రెండు చిత్రాలపైనే ఈ భామ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే తెలుగులో నటించనున్న పుష్ప-2 మినహా మరో చిత్రం లేదు.

చదవండి: సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్‌ బాబు కీలక నిర్ణయం!

ఇక కోలీవుడ్‌ లోనూ విజయ్‌తో జతకడుతున్న వారీసు చిత్రం ఈమెకు చాలా కీలకం. ఇక్కడ ఈ చిత్రం విజయం రషి్మకకు చాలా అవసరం. కారణం కోలీవుడ్‌లో కార్తీకి జంటగా పరిచయం అయిన సుల్తాన్‌ చిత్రం ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఆర్థికంగా ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. తండ్రి కూడా వ్యాపార రంగంలో సంపాదిస్తున్నారు. ఆ మధ్య ఆయన ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు కూడా జరిగాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే రష్మిక మందన్నా జీవితంలో పేదరికం అనే మరో కోణం కూడా ఉందట.

చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు

మాతృభాష (కన్నడం)లో కిరిక్‌ పార్టీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన రష్మిక బాల్యం భారంగానే సాగిందట. ఆదిలో కుటుంబ జీవితం కష్టంగా ఉండేదట. ఈ విషయాన్ని రష్మికే స్వయంగా చెప్పింది. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె తన బాల్యం రోజులను గుర్తు చేసుకుంది. తన చిన్నతనంలో కుటుంబం చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొందని, నాన్న ఆదాయం లేక చాలా కష్టాలు అనుభవించినట్లు చెప్పింది. ఇంటి అద్దె చెల్లించలేక రెండు నెలలకొకసారి ఇల్లు మారాల్సిన దుస్థితి ఉండేదని తెలిపింది. నాన్న తనకు ఒక బొమ్మను కూడా కొనివ్వలేకపోయారని తన బాల్య పేదరికాన్ని గుర్తు చేసుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement