ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
మొత్తం మీద తెలుగుదేశం పాలనలో దళితులు, బహుజనులు, మైనార్టీలు, రైతులు–ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు తమ చదువులకు ఉద్యోగం రాదనే నిరాశతో వ్యసనాలకు బానిసలౌతున్నారు. బాబు తమ సమస్యలు పరిష్కరించలేరనీ, ఆయన వైఖరిలో మార్పు తీసుకురాలేమని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబు నేతృత్వంలోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఓడించడమే తెలుగు ప్రజలకు ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు తావు లేదు. అప్రజాస్వామిక విధానాలతో పేద, బలహీన వర్గాల క్షేమం పట్టించుకోని నేతలను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర మనది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన వ్యాఖ్యల వల్ల దళిత, బహుజన, మైనార్టీ వ్యతిరేకిగా ముద్రపడింది. జూన్ రెండు నుంచి ప్రారంభమయ్యే నవనిర్మాణ దీక్షలకు ఆంధ్రప్రదేశ్ విధ్వంసక దీక్షలని పేరు పెడితే బాగుండేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యవసాయ, పారి శ్రామిక, సేవా రంగాలను ఇతర దేశాలకు తాకట్టు పెడుతూ వచ్చారు. పది లక్షల మంది యువకులకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్‌తో ప్రకటన చేయించారు.
రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు, కొత్త ఉద్యోగాలు కల్పించినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో భూములు, మౌలిక వనరులను విదేశీ పెట్టుబడి దారులకు అమ్ముతున్నారు. ముఖ్యమంత్రికి ఓడ రేవుల నిర్మాణం మీద దృష్టి లేదు. విపరీతంగా అడవులు నరకడం, ఇసుక తవ్వ కాల వల్ల కోస్తా ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత లోపిం చింది. తెలుగుదేశం మహాసభల్లో దళితులకు సబ్‌ప్లాన్ నిధుల పరిరక్షణపై తీర్మానం చేయలేదు.
దళిత భూముల్ని నీరు, చెట్టు పేరుతో ఆక్రమించి భూస్వాముల అధీనంలోకి వెళ్లేలా చేస్తు న్నారు. నాలుగేళ్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో తెలుగు దేశం భాగస్వామిగా కొనసాగింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్యాకేజీ చాలని గతంలో ప్రకటించిన సీఎం ఇప్పుడు తన అనుయా యులతో మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలను హిట్లర్, ముసో లిని అంటూ తిట్టిస్తున్నారు.
రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూములను చంద్ర బాబు సర్కారు సేకరించింది. వీటన్నిటినీ విదేశీ, స్వదేశీ పెట్టుబడి దారులకు పారిశ్రామిక ప్రోత్సాహం పేరిట కేవలం రూ.100 కోట్లకే ఇస్తున్నారు. రాష్ట్రానికి 90 శాతం కేంద్రం గ్రాంటుగా ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేది రు.25,000 కోట్లు మాత్రమే. ఇందులో రు.13,000 కోట్లు ఇప్పటికే ఇచ్చినట్టు కేంద్రం చెబుతోంది. విదేశీ బ్యాంకుల నుంచే ఎక్కువ రుణాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లల మీద అత్యాచారాలు పెరగ డానికి విపరీతంగా పెరుగుతున్న మద్యం దుకాణాలే కారణం.
గుంటూరు జిల్లాలోని అనేక పట్టణాల్లో తెలుగుదేశం నాయకులు మద్యం దుకాణాలు నడుపుతున్నారు. రాష్ట్రంలో తాగుడువల్ల మర ణించిన వారి సంఖ్య పెరుగుతోంది. వారి పిల్లలు అనాథలవుతు న్నారు. అత్యాచారానికి గురయ్యే పిల్లల్లో కూడా తండ్రిలేని పిల్లలే ఎక్కువ. తెలుగుదేశం స్థాపకుడు, చంద్రబాబు మామ ఎన్టీ రామా రావు ప్రజల కోరిక మేరకు 1995లో మద్యపాన నిషేధం ప్రవేశపె ట్టారు. ఎన్టీఆర్ తర్వాత సీఎం పదవి చేపట్టిన బాబు నెమ్మదిగా నిషేధం సడలించి తర్వాత పూర్తిగా ఎత్తి వేశారు. బిహార్‌లో రెండేళ్ల క్రితం మద్య నిషేధం ప్రకటించాక ఉత్పాదకత, ప్రజల ఆదా యాలు పెరిగాయి. ఫలితంగా పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టడానికి బిహార్ పరిగెత్తుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏపీకి అత్యవసరం. తెలుగుదేశం పాలనలో నదులు, చెరు వులు మురికి కూపాలుగా మారుతున్నాయి.
రాష్ట్రంలో దళితుల కష్టాలు పెరిగిపోతున్నాయి. వారిలో 80 శాతం వ్యవసాయ కూలీలే.. వ్యవసాయంలో యంత్రాల విని యోగం పెరగడంతో కూలి దినాలు తగ్గిపోతున్నాయి. దళితులు వలస బాట పట్టాల్సి వస్తోంది. ఈ వలసల వల్ల వృద్ధులు, చదువుకునే పిల్లలకు ఆసరా లేకుండా పోయింది. దళితులకు ఇతర ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. దళితులకు ప్రధాన ఉపాధి వనరు భూమి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎకరం భూమి కూడా దళితులకు ఇవ్వలేదు. భూమి దళి తుల ఆత్మగౌరవానికి హామీ ఇస్తుంది. గ్రామం పునాదులు గట్టి పడాలంటే దళితులకు భూమి ఇవ్వాలని బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. భారతదేశం మొదటి ప్రణాళికలోనే దళితులకు భూమి కొనుగోలు పథకాన్ని ప్రవేశపెట్టారు అంబేడ్కర్.
వ్యవసాయ ఆధా రిత పరిశ్రమల వృద్ధి, నదులు, సముద్రాలను ఉత్పత్తికేంద్రాలుగా మార్చడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. బాబు పాల నలో గనుల తవ్వకాల వల్ల ఈ మూడు పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో భవన నిర్మాణం, ఉపాధి పనుల్లో, ముఖ్యంగా సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక కార్యకలాపాల్లో దళితులే కీలక పాత్ర పోషిస్తున్నారు. దళితుల జీవన వ్యవస్థల్ని బలహీన పరచడం వల్ల రాష్ట్రం ముందుకు సాగదని పాలకులు గుర్తించడం లేదు.
ముఖ్యమంత్రి ప్రభుత్వ రంగాన్ని బాగా దెబ్బతీస్తూ, ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దానివల్ల దళి తులు, బహుజనులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దూరమౌ తున్నారు. 2018–19లో దళితులకు రూ.11,228 కోట్లు ఉప ప్రణా ళిక కింద, రూ.4,278 కోట్లు బడ్జెట్ కింద చూపారు. అదే విధంగా ఆదివాసీలకు (గిరిజనులకు) రూ.27,566 కోట్లు బడ్జెట్ ఉప ప్రణాళిక కింద కేటాయించారు. దళితులు, ఆదివాసీలకు కేటా యించిన నిధుల్లో కనీసం 70 శాతం ఖర్చు చేసినా కొంత సమాజిక మార్పు జరిగేది. మొత్తంమీద తెలుగుదేశం పాలనలో దళితులు, బహుజనులు, మైనార్టీలు, రైతులు–ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
విద్యార్థులు తమ చదు వులకు ఉద్యోగం రాదనే నిరాశతో వ్యసనాలకు బానిసలౌతు న్నారు. బాబు తమ సమస్యలు పరిష్కరించలేరనీ, ఆయన వైఖ రిలో మార్పు తీసుకురాలేమని అన్ని వర్గాల ప్రజలు భావిస్తు న్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబు నేతృత్వంలోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఓడించడమే తెలుగు ప్రజలకు ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఉపాధి కల్పనలో, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం కావడం, పెట్రోలు, డీజిల్ ధరలు అదుపుచేయలేకపో వడం వంటి కారణాల వల్ల కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీ, దాని మిత్రపక్షాలు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరాజయం పాలయ్యాయి.
అనేక రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, పేదలు పాలకపక్షాలకు వ్యతిరేకంగా ఏక మౌతున్నారు. అదే మార్గంలో ఏపీలో కూడా ప్రజలు పాలక పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడే రాజకీయ సమీకరణలకు మద్దతు పలకాలి. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పట్టించుకోకుండా ధనికులకే దోచిపెట్టే పార్టీలను ఓడించడానికి సామాజిక సమీకరణలు తోడ్ప డతాయి. సామాజిక విప్లవకారులు బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా ఫూలే ఆలోచనలు ప్రతిపక్షాల వాక్కుల్లో, ఆచరణలో ప్రతిబింబిం చాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు తావు లేదు. అప్రజాస్వామిక విధానాలతో పేద, బలహీన వర్గాల క్షేమం పట్టించుకోని నేతలను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర మనది.
- డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్రపార్టీ
వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment