
తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో స్పందన
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): పేదింటిలో పుట్టినా తన చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది.. డిగ్రీ పైనలియర్ చదువుతూనే పైలట్ కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది.. కాంపిటీటివ్ పరీక్ష రాసి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. కానీ ఫీజు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది కేశవాపూర్‌కు చెందిన పాతకాల స్పందన.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల సదయ్య–రమ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్పందన వరంగల్‌లోని సోషల్ వెల్ఫేర్ డీగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతూ ఎలాగైనా పైలట్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్ష రాసింది. అందులో సత్తా చాటి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. శిక్షణ కోసం బేగంపేటలోని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చేరింది.
కానీ పూర్తి శిక్షణ కోసం రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి, కూలి పని చేసుకునే తన తల్లిదండ్రులకు అంత మొత్తం చెల్లించలేరని ఆవేదన చెందుతోంది. దాతలు స్పందించి, ఆర్థికసాయం చేస్తే పైలటవుతానని వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment