
కడప అర్బన్ : కడప పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వేర్వేరు చోట్ల ఇద్దరు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనల వివరాలను రైల్వే ఎస్‌ఐ రారాజు సోమవారం వెల్లడించారు. కడప నగరంలోని అక్కాయపల్లె తిలక్ నగర్‌కు చెందిన యువకుడు ఎస్.భాస్కర్ (26) సెల్‌ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కడప– కృష్ణాపురం రైల్వే ట్రాక్‌లో దిగువ లైన్‌లో జరిగింది. మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్‌ఐ రారాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
మృతుడి చేతిలో ‘నన్ను క్షమించం డి.. నేను చనిపోతున్నాను’ అని రాసి ఉన్న చీటీ లభించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే కడప రైల్వే పోలీస్ పరిధిలోని మంటపంపల్లె– నందలూరు రైల్వే మార్గంలో దిగువలైన్‌లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి (55) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లకలర్ చొక్కా పంచె, ఆరెంజ్ కలర్ టువల్ ధరించి ఉన్నాడు. ఈ సంఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment