రమజాన్ కాంతులు
ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ జకాత్ చెల్లించాలి. హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ(ర)ప్రకారం ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా ఉపదేశించారు:‘ఐదు ఉఖియాల కంటే వెండి తక్కువగా ఉంటే దానిపై జకాత్ లేదు. అలాగే వెండి ఐదు ‘ఉఖియా’ లకంటే ఎక్కువ ఉంటే జకాత్ తప్పనిసరి అవుతుంది. ఐదు ఉఖియాలంటే తూకం ప్రకారం చూస్తే యాభైరెండున్నర (52 1/2)తులాలు. ఇదేవిధంగా జకాత్ చెల్లింపుకు బంగారం పరిమితి ఐదున్నర (5 1/2)తులాలు.
అంటే అటూ ఇటుగా 65 గ్రాములు. కనీసం ఐదున్నర తులాల బంగారం లేక దానికి సరిపడా నగదు ఎవరిదగ్గరైనా ఉండి, ఒకసంవత్సరం గడిచిపోతే వారిపై జకాత్ చెల్లింపు వాజిబ్ అయిపోతుంది. ఇంతకంటే తక్కువ పరిణామంపై జకాత్ లేదు. ఈ పరిమితికి మించిన సంపద ఏ రూపంలోనైనా (కొన్నిరకాల స్థిరాస్తులు మినహాయించి) ఒక సంవత్సరకాలం నిల్వ ఉన్నట్లయితే ఆ మొత్తానికి రెండున్నరశాతం చొప్పున లెక్కకట్టి జకాత్ చెల్లించాలి.
– ఎండీ ఉబైద్ ఖాన్
జకాత్ ఎవరు చెల్లించాలి?
Published Thu, Jun 8 2017 11:09 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement