కృష్ణా జిల్లాలో కొత్తరకం పైశాచికత్వం వెలుగుచూసింది. ఆర్థిక లావాదేవీల కారణంగా దంపతులను కిడ్నాప్ చేసి రాత్రంతా కారులోనే తిప్పుడూ దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సత్యనారాయణపురానికి చెందిన చంద్రశేఖర్, రమాదేవిలు దంపతులు. అయితే కొందరు గుర్తుతెలియని దుండగులు వీరిని గురువారం రాత్రి ఇంటి నుంచి కారులో తీసుకెళ్లారు. రాత్రంతా కారులోనూ తిప్పుడు వేధింపులకు గురిచేస్తూ దాడులకు పాల్పడ్డారు.