
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేసిన చైనా కంపెనీ షావోమి మరింత శరవేగంగా దూసుకొస్తోంది. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయం, పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించడానికి యోచిస్తోందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కార్లు విక్రయాలతో పాటు రుణాలు ఇవ్వడం లాంటి ఇతర ఫైనాన్సింగ్ సేవలను అందించనుందనీ ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్‌లో తెలిపిందని పేర్కొంది.
ఆర్‌ఓసీలో షావోమి దాఖలు చేసిన వివరాల ప్రకారం, అన్ని రకాల వాహానాలు (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) రవాణ పరికరాలు, ఇతర రవాణా సామగ్రి, విడిభాగాలను సరఫరా చేయనున్నామని ప్రకటించింది. అంతేకాదు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, పేమెంట్ బ్యాంకు, లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక సేవలు, పేమెంట్ గేట్ వే, సెటిల్మెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, మొబైల్ వర్చ్యువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment